udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:00 am Digital Edition : UDYAMA VAARTHA

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి దిక్సూచి – తాసిల్దార్ వి. సుదీర్.

తోటపల్లి గూడూరు, ఏప్రిల్ 14 (ఉద్యమ వార్త)

తోటపల్లి గూడూరు మండలంలోని ముంగలదొరువు, మెగలి గుంట పోతన, చింతోపు ప్రాంతాల్లో మాగుంట రమణారెడ్డి ఆధ్వర్యంలో, గూడూరులో మన్యం జితేంద్ర గౌడ్, నరుకూరులో మండల అధ్యక్షులు కొణతం రఘుబాబు, ముసలి పరందామయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించగా, నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాసిల్దార్ వి. సుదీర్ మాట్లాడుతూ అంబేద్కర్ సమాజానికి దిక్సూచి వంటివారని, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యపై అంబేద్కర్ చూపిన ప్రాధాన్యతను గుర్తుచేసి, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను అనుసరించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి ఎన్. మంజుల సమాజంలో సమానత్వ స్థాపనకు అంబేద్కర్ ఆలోచనలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పైనం కోటేశ్వరరావు, పైనం శ్రీనివాసులు, దేవరాల ప్రవీణ్, లాలం చంద్రశేఖర్‌తో పాటు సచివాలయ సిబ్బంది,తెలుగు దేశం పార్టీ నాయకులు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అంబేద్కర్ ఆశయాలను కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు.